డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించండి: ఎమ్మెల్యే

గురువారం తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు. స్థానిక కళాశాల సమీపంలో డ్రైనేజీ సమస్యను ఆయన స్వయంగా పరిశీలించి, మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వెంటనే పరిష్కరించి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందులు తొలగించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్