కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో మే 29న ప్రత్యేక PGRS కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ఈ నెల 29న 2వ వారం ప్రత్యేక PGRS (ప్రజా ఫిర్యాదుల పరిష్కార) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో కె. ఆనందరావు గురువారం తెలిపారు. ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జేసీ వై. మేఘా స్వరూప్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్