చాగల్లు మండలం ఉనగట్ల గ్రామంలోని ఎం.ఎస్.ఎల్. (MSL) పాయింట్లను బుధవారం జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిల్వ ఉన్న సరుకుల స్టాక్ వివరాలు, రికార్డుల నిర్వహణ, పంపిణీ విధానాలను సమీక్షించారు. చౌక ధరల దుకాణాలకు సకాలంలో స్టాక్ విడుదల చేయాలని, రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.