రాయవరం: చెల్లూరు సర్వరాయ చక్కెర కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై విచారణకు హైదరాబాద్ నుంచి నిపుణుల బృందం శనివారం రానుంది. ఫ్యాక్టరీ జీఎం జి. కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, కెమికల్ రియాక్షన్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిపుణుల బృందం పరిశీలన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను సాంకేతికంగా విశ్లేషించి నివేదిక అందజేస్తారని ఆయన పేర్కొన్నారు.