డెంగ్యూ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రంగారావు పేర్కొన్నారు. మండపేట పురపాలక సంఘ పట్టణ పరిధిలో గురువారం డెంగ్యూ మాసోత్సవ ముగింపు సభ నిర్వహించారు. ఏడిది రోడ్లోని శ్రీ వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. మానవహారం ఏర్పాటు చేసి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో అన్ని వార్డు సచివాలయాల నుండి గవర్నమెంట్, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.