మండపేట మునిసిపల్ కమిషనర్ టీవీ రంగారావు శుక్రవారం 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' రెండో వారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గాంధీనగర్, సైదిల్‌పేట, టౌన్ హాల్ రోడ్డు, రైతు బజార్ పరిసరాల్లోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను, కాలువల్లోని సిల్ట్‌ను కమిషనర్ స్వయంగా తొలగించారు. స్వచ్ఛ మండపేట లక్ష్యంగా ఈ పనులు కొనసాగుతాయని ఆయన తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు.