ద్వారపూడి సుబ్రమణ్య స్వామి ఆలయ సమీపంలో ట్రాఫిక్ చిక్కులు

మండపేట మండలం ద్వారపూడిలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైంది. ముఖ్యంగా సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ వద్ద ఖాతాదారులు వాహనాలను రోడ్డుపై అడ్డదిడ్డంగా నిలుపుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బ్యాంకు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు సూచిస్తున్నారు. నిరంతర ట్రాఫిక్ చిక్కులతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, గ్రామస్థులు గురువారం పంచాయతీ మరియు పోలీస్ అధికారులను తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్