ఈవీఎం గోదాముల భద్రతపై కోనసీమ జేసీ నిరంతర నిఘా ఆదేశాలు

ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదాముల సీళ్లను జేసీ వైఖోం నైడియాదేవి శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భద్రతలో రాజీ పడకుండా 24/7 పటిష్ట నిఘా ఉంచాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తహసిల్దార్ సుభాష్, ఈఈ సుబ్బరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్