కోనసీమలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అర్ధరాత్రి, తెల్లవారుజామున నిద్రమత్తులో వాహనాలు నడిపే డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఈ వినూత్న పద్ధతిని అమలు చేస్తున్నారు. హైవేలపై వాహనాలను ఆపి, డ్రైవర్ల ముఖం కడిగించి, వారు పూర్తిగా మెలకువ వచ్చాకనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ప్రతి ప్రాణం విలువైనదని, డ్రైవర్లు తమ కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. నిద్రమత్తు వల్ల కలిగే అనర్థాలను నివారించేందుకు డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని ఆయన మంగళవారం కోరారు.