ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 11 కేవీ ముమ్మిడివరం ఫీడర్‌ను రెండు ఫీడర్లుగా మార్చే పనుల నిమిత్తం, విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముమ్మిడివరం, కొత్తలంక, కర్రివానిరేవు, గాడిలంక, అన్నంపల్లి, చింతపల్లి లంక, చిన్న కొత్తలంక, గేదెలంక, కోమనపల్లి, వరగలంక, వడ్డిగూడెం, గోదాసీవారిపాలెం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.