అమలాపురం సబ్ డివిజన్‌లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో జూన్ నెల అంతటా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు మరియు ఊరేగింపులు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.

సంబంధిత పోస్ట్