కొత్తపేట ప్రభల తీర్థం ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ

కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ తో కలిసి ఈ నెల 15వ తేదీన జరగనున్న కొత్తపేట ప్రభల తీర్థం ప్రదేశాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తు, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించి, ట్రాఫిక్ క్రమబద్దీకరణపై చర్చించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్