కలెక్టర్ చేకూరి కీర్తి పర్యటన: రైతు సమస్యలపై కిసాన్ మోర్చా వినతి

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి బుధవారం ఉండ్రాజవరం (M) తాడిపర్రు గ్రామంలో సమగ్ర భూ కొలతలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, డంపింగ్ యార్డ్ కొరత వంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కిసాన్ మోర్చా నాయకులు కలెక్టర్‌ను సాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో MRO ప్రసాద్, ఎంపీడీఓ, సెక్రటరీ ముసలయ్య పాల్గొన్నారు. తాడిపర్రులో డంపింగ్ యార్డ్ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్