నిడదవోలు: RTC డిపో అభివృద్ధికి అధికారుల నిర్లక్ష్యం

నిడదవోలు RTC డిపో అభివృద్ధికి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని RTC డిపో సాధన సౌకర్యాల పోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు విమర్శించారు. నిడదవోలులో ఆయన మాట్లాడుతూ, 2006కు ముందు 78 బస్సులు ఉండగా, ప్రస్తుతం 34 బస్సులు మాత్రమే ఉన్నాయని, అందులో సగం కాలం చెల్లిన బస్సులేనని తెలిపారు. పలు సర్వీసుల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్