పెరవలి మండలం కానూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా గురువారం కానూరు, నడుపల్లి గ్రామాలకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ ఎన్ నారాయణ అప్పారావు బుధవారం తెలిపారు. వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.