నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని YCP కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. దోమలు, కుక్కల నియంత్రణకు బడ్జెట్‌లో నిధులు చూపుతున్నా ఆచరణలో పారిశుద్ధ్యం మెరుగుపడటం లేదని కౌన్సిలర్ కామిశెట్టి సత్తిబాబు విమర్శించారు. తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.