ఓటర్ల జాబితా సవరణకు సహకరించండి: కమిషనర్

సామర్లకోట మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 15 నుంచి జులై 14 వరకు ఓటర్ల వివరాల పరిశీలన, వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్