డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం పెద్దాపురం డిఎస్పి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ సందర్శన జరిగినట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెద్దాపురం డిఎస్పి కె. వి సత్యనారాయణ డివిజన్ పరిధిలోని వివరాలను ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐలు, ఇతర పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్