సామర్లకోటలో రేపు మంచినీటి సరఫరా నిలిపివేత

సామర్లకోట పట్టణంలో ఏప్రిల్ 10న తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద పైప్ లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య తెలిపారు. ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని, మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్