సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన బాణాసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ బుధవారం ఘటన స్థలాన్ని సందర్శించనుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ సభ్యుడిగా ఉన్న ఈ కమిటీ ప్రమాద తీవ్రత, కారణాలు, అనంతర పరిస్థితులపై జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరించనుంది. ఈ పేలుడు ఘటనలో 28 మంది మృతి చెందారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించారు, అయితే చికిత్స పొందుతున్న బాధితులకు మరింత సహాయం అందించాలని కోరుతున్నారు.