కాకినాడకు నూతన అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రియా

కాకినాడ జిల్లాకు నూతన అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ గా ప్రియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందించారు. అనంతరం పీజీఆర్‌ఎస్ విధానం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేస్తానని ప్రియా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్