పెద్దాపురం: టిడ్కో గృహ ప్రాంత సమస్యలపై కమిషనర్ కు వినతి

పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం టిడ్కో గృహాల్లోని సమస్యలపై తక్షణమే చర్యలు చేపట్టాలని కాలనీవాసులు సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొలిశెట్టి రామ్ కుమార్ ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలాల ఆక్రమణలు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ వినతిని అందించారు. దీనిపై కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ సత్వర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్