సామర్లకోటలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

సామర్లకోట పట్టణంలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ ప్రభాకర్ తెలిపారు. పిఠాపురం రోడ్డులోని ఉప్పువారి సత్రం సమీపంలో 33 కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో సామర్లకోట పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని శాఖకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్