పెద్దాపురం మండలం ఆర్బీపట్నం 33/11 కేవీ ఉపకేంద్రంలో వార్షిక మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ ప్రభాకర్ తెలిపారు. ఈ అంతరాయం ఆర్బీకొత్తూరు, ఆర్బీపట్నం, సామర్లకోట మండలం పీబీదేవం, జి. మేడపాడు ప్రాంతాలలోని వ్యవసాయ వినియోగదారులు, పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. విద్యుత్ వినియోగదారుల సహకారాన్ని డీఈఈ కోరారు.