ధవళేశ్వరంలో పారిశుధ్య లోపంపై గ్రామస్తుల ఆందోళన

తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరంలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై శనివారం గ్రామస్తులు స్థానిక సచివాలయంలో ఎంపీడీఓను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన ఎంపీడీఓ, పారిశుధ్య పరిస్థితులపై ఆరా తీసి, శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రానున్న వర్షాకాలంలో చెత్త తొలగింపు, కాలువల శుభ్రత, దోమల నివారణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్