గోడచిత్రాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

పిఠాపురం పట్టణంలో ప్రజాధనంతో రూపొందించిన కళాత్మక గోడచిత్రాలు, సాంస్కృతిక పెయింటింగ్లను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని విశ్వ హైందవ పరిషత్ నాయకులు కోరారు. శనివారం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వినతిపత్రం సమర్పించి, కొందరు వ్యక్తులు గోడచిత్రాలపై పోస్టర్లు, ప్రకటనలు అతికించడం వల్ల వాటి అందం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళా వారసత్వాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుని, గోడచిత్రాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్