బి. కొత్తూరులో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం

ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ బి. కొత్తూరు గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో శాంతి భద్రతలపై చర్చించి, స్థానిక ఎన్నికల నేపథ్యంలో వివాదాలు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్