స్వల్ప వర్షానికే పట్టణంలోని 2, 3, 4 వార్డుల్లో రహదారులు జలమయమవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని 2, 3, 4 వార్డుల సమస్యల పరిష్కార పోరాట కమిటీ కన్వీనర్ కరణం విశ్వనాథం ఆరోపించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, భాష్యం స్కూల్ రోడ్డు, వన్‌వే మార్గంలో వర్షపు నీరు నిలవడంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పీజీఆర్‌ఎస్ ద్వారా పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రహదారిని ఎత్తు చేయడంతో పాటు, 2, 3, 4 వార్డుల్లో శాశ్వత డ్రైనేజీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని పోరాట కమిటీ డిమాండ్ చేసింది.