పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నుంచి మార్కెట్ బస్టాండ్ వెళ్లే దారిలో బుధవారం అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగించారు. దుకాణదారులు తమ సామాన్లను రోడ్డుపై పెట్టడం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోందని ప్రజల ఫిర్యాదుల మేరకు కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఎవరైనా రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.