గొల్లప్రోలు: శివాలయం కాలనీలో తాగునీటి కష్టాలు..

గొల్లప్రోలు పట్టణ శివారులోని శివాలయం కాలనీలో గత వారం రోజులుగా తాగునీటి సమస్య తీవ్రమైంది. కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామని చెబుతున్నా, వీధి చివర్లోని కొద్ది ఇళ్లకే పరిమితమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకుని తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్