వైద్యులు అందుబాటులో లేక ఆసుపత్రి బయటే వ్యక్తి మృతి

గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. శరభవరానికి చెందిన ఓ వ్యక్తి చేబ్రోలు, గొల్లప్రోలులో పని చేసుకుంటూ జీవించేవాడు. రాత్రి మూడు గంటలకు నీరసంగా ఉండడంతో చేబ్రోలు ఆసుపత్రికి వచ్చాడు. లైట్లు వేసి ఉన్నాయి కానీ బయట తాళం వేసి ఉంది. సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి బయటే మృతి చెందాడు. పవన్ సొంత నియోకజవర్గం పరిస్థితి ఇలా ఉందని పలువురు పెదవి విరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్