పిఠాపురం రచ్చకెక్కిన మున్సిపల్ కమిషనర్ ఆడియో బూతుపురాణం

పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు శానిటరీ సెక్రటరీ సుధీర్ ను దుర్భాషలాడడంతో మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లావ్యాప్త సచివాలయ సిబ్బంది వందల సంఖ్యలో చేరుకుని కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాగా, బాధితుడికి న్యాయం జరగకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, పనులను సక్రమంగా నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులను చులకనగా చూడటం సరికాదని, బూతులు మాట్లాడి మనోభావాలు దెబ్బతీసిన కమిషనర్ ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్