రాయవరం–వెల్దుర్తి–దొంతమూరు–ధర్మరం ప్రధాన రహదారి పునర్నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తయ్యాయని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. రూ. 2 కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టిన ఈ బీటీ రెన్యువల్ పనుల్లో నిబంధనల ప్రకారం 25 మి.మీ.కు బదులుగా 40 మి.మీ. మందంతో బీటీ వేశామని ఆయన ఆదివారం పనులను పరిశీలించిన అనంతరం వెల్లడించారు. రహదారి పూర్తిగా స్థిరపడటానికి 15 రోజులు పడుతుందని, అప్పటివరకు కనిపించే స్వల్ప మార్పులపై అపోహలు నమ్మవద్దని సూచించారు. నాణ్యత పరీక్షలు పూర్తయ్యాకే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తామని, పనుల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.