కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ పరిధిలోని ఎన్‌హెచ్-216 గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించకుండా, కొత్త హెల్మెట్లు కొనుగోలు చేసి ధరింపజేస్తూ, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, మైనర్లతో వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ వెనుకే వాహనాలు నిలపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలాన్లు జారీ అవుతాయని తెలిపారు.