చెరువు ఆక్రమణదారులకు నోటీసులు

గొల్లప్రోలు మండలం చెందుర్తి పెద్ద చెరువు గర్భాన్ని ఆక్రమించి చేపల చెరువులు తవ్వేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురిని గుర్తించి తహసీల్దార్ రామ్ కుమార్ నోటీసులు జారీ చేశారు. స్థానిక రైతుల ఫిర్యాదు మేరకు సర్వే నిర్వహించగా, 8.42 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు తేలింది. అనుమతులు లేకుండా చెరువులు తవ్వేవారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్