పిఠాపురంలో ఫ్లెక్సీల తొలగింపుకు ఆదేశాలు

పిఠాపురం పట్టణంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని పురపాలక శాఖ చర్యలు ప్రారంభించింది. కమిషనర్ కనకారావు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని సూచించారు. ఇటీవల గాలులు, వర్షాల కారణంగా పలుచోట్ల ఫ్లెక్సీలు ప్రమాదకరంగా మారాయని, ప్రజల భద్రత దృష్ట్యా నిర్వాహకులు సహకరించాలని కోరారు. 30 వార్డుల పరిధిలో ప్రమాదం కలిగించే ఫ్లెక్సీలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్