గొల్లప్రోలులో పాఠశాలలపై పీడీ సమీక్ష

పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ బుధవారం గొల్లప్రోలు మండలంలోని బాయ్స్ హైస్కూల్‌ను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. హెడ్ మాస్టర్, ఎంఈఓలతో సమావేశమై తరగతి గదులు, తాగునీటి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన వసతులను మెరుగుపరచాలని, పనుల అంచనాలను త్వరగా సిద్ధం చేయాలని మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్‌కు ఆదేశించారు. గొల్లప్రోలు గర్ల్స్ జూనియర్ కాలేజీ కోసం ప్రతిపాదిత స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, హెచ్‌ఎం, పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్