పిఠాపురం పాడా కార్యాలయంలో జూన్ 29 (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాడా పీడీ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్‌లోని పాడా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డివిజనల్, మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమానికి రాలేని అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.