ఆరు నెలల విదేశీ పర్యటన ముగించుకుని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు శుక్రవారం తిరిగి విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని, పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.