నేడు పిఠాపురం కౌన్సిల్ సమావేశం

పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాలులో జరగనుంది. రైతుబజారు, చేపల మార్కెట్ సహా ఇతర భూ ఆక్రమణలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, అధికారులు హాజరుకావాలని కమిషనర్ నామా కనకారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్