కాకినాడ జిల్లాలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వ్యాపారులతో అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కనకరావు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, పర్యావరణ పరిరక్షణ, పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని వ్యాపారులను కోరారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వాడాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.