గొల్లప్రోలులో తాగునీటి సమస్య పరిష్కారానికి వినతి

గొల్లప్రోలు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని జనసేన పార్టీ నాయకులు కడారి తమ్మయ్య నాయుడు, వార్డ్ ఇన్‌చార్జీలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులను కోరారు. పలుచోట్ల నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సమస్య త్వరగా పరిష్కారమవుతుందనే ఆశాభావం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్