ఆ ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీ

యు. కొత్తపల్లి మండలం యండపల్లి జడ్పీ పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు ఒక వర్గం విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ స్థానికులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై కలెక్టర్ షన్మోహన్ మంగళవారం ఎంఈవో వేణుగోపాల్ ను విచారణకు ఆదేశించారు. ఎంఈవో సమర్పించిన నివేదిక ఆధారంగా, ప్రధానోపాధ్యాయుడు సురేష్ భూషణంను శంఖవరం, ఆంగ్ల ఉపాధ్యాయుడు శ్రీనుబాబును వేళంగి, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రసాదావును రౌతులపూడి పాఠశాలలకు బదిలీ చేసినట్లు ఎంఈవో మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్