శంఖవరం తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ తనిఖీ

శంఖవరం తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రిజిస్టర్లు, జనగణన పనుల పురోగతిని పరిశీలించి, సిబ్బంది కొరత, హాజరు లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్మశానవాటిక ఆక్రమణలపై ఫిర్యాదును పరిశీలించి, సమస్య పరిష్కారానికి పెద్దాపురం ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. జనగణన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, రెవెన్యూ సమస్యలు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్