అన్నవరం పుణ్యక్షేత్రంలో పారిశుధ్య నిర్వహణలో తేడా వస్తే సహించేది లేదని దేవస్థానం ఈవో చక్రధరరావు హెచ్చరించారు. గురువారం దేవస్థానం శానిటరీ సంస్థ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించేలా సంస్థ చర్యలు చేపట్టాలని సూచించారు.