రాజమండ్రిలోని బత్తిన నగర్ లో శుక్రవారం జరుగుతున్న పెన్షన్ పంపిణీని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి, పెన్షన్ పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా అని ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలపై కూడా వివరాలు తెలుసుకుని, లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.