భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, సోమవారం రాజమహేంద్రవరంలోని ఎఫ్‌సీఐ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ పుటేజ్, రికార్డులను పరిశీలించి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా అమలులో ఉన్నాయని నిర్ధారించారు. ఈ తనిఖీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను, భద్రతను నిర్ధారించడంలో భాగంగా జరిగింది.