లీగల్ ఎయిడ్ సేవలను వినియోగించుకోవాలి

తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీ లక్ష్మి బుధవారం రాజమండ్రిలోని కేంద్ర కారాగారం, మహిళా కారాగారాన్ని సందర్శించారు. కారాగారాలలో ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించి, ఖైదీలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖైదీల తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు అవసరమైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్