వైద్య విద్యార్థుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే

రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని వైద్య విద్యార్థుల వసతి గృహాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని తన దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించి, అధికారులతో కలిసి స్వయంగా అక్కడికి చేరుకున్నారు. స్థితిగతులను పరిశీలించిన అనంతరం, సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్