ప్రజలకు పూర్తి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో రాత్రి గస్తీని మరింత పెంచినట్లు తూగో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలతో పాటు, రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనదారులకు 'ఫేస్ వాష్' వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.